Monday, April 29, 2024

ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
– ఎఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బిజేఆర్ స్టాట్యూ మీదుగా వచ్చే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
– బషీర్‌బాగ్ నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా వెళ్లే వాహనాలను బిజెఆర్ విగ్రహం మీదుగా ఎస్‌బిహెచ్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు వెళ్లాలి.
– సుజాతా స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ మీదుగా వచ్చే వాహనాలు సూజాతా స్కూల్ జంక్షన్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.

రద్దీ ఉండే జంక్షన్లు….
పంజాగుట్ట, వివి స్టాట్యూ, రాజీవ్ గాంధీ స్టాట్యూ, నిరంకారీ, సైఫాబాద్ ఓల్డ్ పిఎస్, లకిడికాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదారబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బిజెఆర్ స్టాట్యూ సర్కిల్, ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఎఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి, కెఎల్‌కె బిల్డింగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ జంక్షన్లు రద్దీగా ఉండనున్నాయి. ఈ జంక్షన్లను వాహనదారులు అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

ఆర్‌టిసి బస్సులు…
రవీంద్ర భారతి మీదుగా బిజేఆర్ స్టాట్యూ నుంచి వెళ్లే ఆర్‌టిసి బస్సులు ఎల్‌బి స్టేడియం మేయిన్ గేట్ మీదుగా వెళ్లకూడదు. ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ ముందు నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా నాంపల్లి వైపు వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News