Tuesday, April 30, 2024

ఆ అవకాశం వస్తే… నా ఫస్ట్ ఛాయిస్ పవన్‌కల్యాణ్

- Advertisement -
- Advertisement -

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’. రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో హీరో నితిన్‌తో ఇంటర్వ్యూ విశేషాలు…

డిఫరెంట్ సినిమా చేయాలని…
‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్’ అంగీకరించా. ఒక కమర్షియల్ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పా. గత ఏడాది ‘భీష్మ’ విడుదలైంది. తర్వాత లాక్‌డౌన్ రావడంతో ‘చెక్’ చిత్రీకరణ ఆలస్యమైంది.
ఎక్కువ శాతం జైలులోనే…
దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మొదట వేరే కథ చెప్పారు. ఆ స్క్రిప్ట్ లైన్ బావుంది. అయితే స్క్రిప్ట్ మీద ఆయన అంత నమ్మకంగా లేరు. నాకూ అంత నమ్మకం కలగలేదు. మళ్లీ రెండు నెలలు గ్యాప్ తీసుకొని వచ్చి ‘చెక్’ స్క్రిప్ట్ చెప్పారు. స్టోరీ లైన్ చెప్పగానే వెంటనే నచ్చింది. కథలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. సాంగ్స్ లేవు. రొమాంటిక్, కామెడీ ట్రాక్స్ లేవు.
క్లైమాక్స్ నచ్చింది…
హీరో ఆదిత్య జీవిత ప్రయాణమే ‘చెక్’. అతను జైలులో ఉండే ఓ ఖైదీ. చెస్ నేర్చుకుని ఎలా గ్రాండ్ మాస్టర్ అయ్యాడు? అనేది సినిమా. చంద్రశేఖర్ ఏలేటి కథ చెప్పినప్పుడు నాకు క్లైమాక్స్ నచ్చింది. చివరి 15 నిమిషాలు సినిమాకే హైలైట్‌గా ఉంటుంది. అక్కడ ఏలేటి మార్క్ అంతా కనిపిస్తుంది.
అందరికీ నచ్చుతుంది…
సినిమాలో నా నటన కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. సినిమా చాలామంది చూశారు. వందమంది చూస్తే… వందమందికీ నచ్చింది. అందరూ బావుందని చెప్పారు.
ఆ విధంగా షూటింగ్ జరిగింది…
నా క్యారెక్టర్ కోసం ముందుగా ప్రిపేర్ కాలేదు. సెట్‌కి వెళ్లాక ఏలేటి ఏం చెబితే అది ఫాలో అయ్యా. భీష్మ, రంగ్ దే సినిమాల సెట్స్‌లో కాస్త హుషారుగా ఉండేవాడిని. ‘చెక్’ సెట్‌లో మాత్రం ఏమీ మాట్లాడకుండా కూర్చోవాడిని. జైలులో ఖైదీ క్యారెక్టర్ కాబట్టి సెట్ వాతావరణం అంతా డార్క్‌గా ఉండేది. షాట్ చేయడం, తర్వాత పక్కకి వెళ్లి కూర్చోవడం. ఈ విధంగా సినిమా షూటింగ్ జరిగింది.
ఎంతో ఆనందం కలిగింది…
రాజమౌళి ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో నా గురించి గొప్పగా చెప్పడంతో ఎంతో ఆనందం కలిగింది. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి నుంచి కాంప్లిమెంట్స్ రావడం గ్రేట్.
ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ కూడా…
సినిమాలో నాది సింగిల్ రోలే. ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ కూడా ఉంది. అందులో కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తా.
రకుల్‌కి థ్యాంక్స్ చెప్పాలి…
ప్రియా ప్రకాశ్ వారియర్‌తో కలిసి పనిచేయడం ఎంతో బాగుంది. తెలుగులో ఆమెకు తొలి సినిమా ఇది. చాలా బాగా నటించింది. అయితే రకుల్‌కి థ్యాంక్స్ చెప్పాలి. సినిమాలో తను లాయర్ రోల్ చేసింది. తనకు, నాకు మధ్య సాంగ్స్ లేవు. రొమాంటిక్ ట్రాక్ లేదు. ఓ మంచి క్యారెక్టర్‌లో నటించడానికి ఆమె ముందుకు వచ్చింది. సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
నెక్ట్స్ లెవెల్‌కు…
సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్ – రీ-రికార్డింగ్‌తో సినిమాను నెక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళారు. ఆయన అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు.
ఎక్కువ టేక్స్ తీసుకున్నా…
దర్శకుడు ఏలేటి స్టయిల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వేరుగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఓ వారం పట్టింది. అప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకున్నా. తర్వాత సులభంగా చేశా. ‘జయం’ తర్వాత అన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఈ సినిమాకే. ఐటెమ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, కామెడీ ఎపిసోడ్స్ వంటివి ఇందులో ఏమీ ఉండవు.
సీక్వెల్ చేసే ఆలోచన…
సినిమా అంతా మంచి కంటెంట్ ఉంటుంది. లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఓటీటీల్లో డిఫరెంట్ సినిమాలు చూశారు. వాళ్లు కూడా డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. క్లైమాక్స్ చూస్తే మీకూ అర్థమవుతుంది.
ఆ ఆసక్తి ఉంది…
మల్టీస్టారర్ ఫిలిమ్స్ చేయాలనే ఆసక్తి ఉంది. అవకాశం వస్తే… నా ఫస్ట్ ఛాయిస్ పవన్‌కల్యాణ్. ఆయనతో ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా.
నెక్ట్స్ సినిమాలు…
‘రంగ్ దే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘అంధాధున్’ రీమేక్ షూటింగ్ సగం పూర్తయింది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ త్వరలో ప్రకటిస్తాం. మేలో ‘పవర్ పేట’ షూటింగ్ ప్రారంభిస్తా. కుదిరితే ఆ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

Actor Nithin Special Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News