Monday, May 13, 2024

న్యాయవాది హత్యాయత్నం కేసును చేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police who cracked Lawyer attempted Murder case

 

మనతెలంగాణ/హిమాయత్‌నగర్: నగరంలో సంచలనం సృష్టించిన న్యాయవాది హత్యయత్నం కేసును పోలీసులు చేదించారు. బుధవారం నారాయణగూడా పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషన్ డీసీపీ రమణరెడ్డి,ఆబిడ్స్ ఎసిపి వెంకట్‌రెడ్డి ఎస్‌హెచ్‌ఓ రమేష్‌కుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ కాచిగూడాకు చెందిన గాన్‌ష్యాం బాలజీసింగ్ వృత్తిరిత్యా మొబైల్ మెకానిక్,రియలెస్టేట్‌వ్యాపారి, కాచిగూడాలోని తన ఇంటి వ్యవహరం, రాజేంద్రనగర్‌లోని న్యాయవాది తండ్రికి చెందిన స్థలం విషయంలో కమీషన్ రాకుండా అడ్డుకున్నాడనే కారణంతో న్యాయవాదిపై కోపాన్ని పెంచుకుని అతనిని చంపాలనే కుట్రలో భాగంగా బాలాజీసింగ్ బండ్లగూడాకు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ వలీ సాయం కోరాడు.ఆటోడ్రైవర్ చంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ వశీం అన్సారీ,హుస్సేన్ సాగర్‌కు చెందినషేక్ సులేమాన్‌ను రెడి చేశాడు.

ఈనెల 16న సాయంత్రం 6గంటల సమయంలో హిమాయత్‌నగర్ స్ట్రీట్‌నెం.7లో నివాసం ఉంటే న్యాయవాది సిద్ధార్థ్‌సింగ్ చైదరి వద్దకు ఈ నలుగురు వచ్చారు.ముగ్గురు ముఖానికి మాస్క్‌లు,చేతికి గ్లౌజులు,ధరించి లోపలికి వెళ్లీ డాక్టర్ మాలిక్‌ఫైల్ కావాలంటూ అడిగారని,మీరెవ్వరంటూ న్యాయవాది ప్రశ్నించేలోపు పిడిగుద్దులు గుద్దారు. కత్తులతో పోడిచే క్రమంలో అతను తప్పించుకుని కిచెన్ రూమ్‌లోకి పారిపోతు కేకలు వేయడంతో చుట్టుప్రక్కలవారు అక్కడకు చేరుకున్నారు.న్యాయవాది బయటకు వస్తే కాల్చివేసేందుకు బాలాజీసింగ్ గన్‌తో రెడిగా ఉన్నట్లు వెల్లడించారు. సంఘటన స్థలం నుండి ఒక గన్,రెండు బ్యాగులు,7బుల్లెట్లు,క మోటార్‌బైక్,కాకీరంగు పేస్‌మాస్క్, సీల్వర్‌రంగ్ టేపు,రెండు హ్యండ్ గ్లౌజులు,6సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,హత్యకు కుట్రపన్నిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News