Tuesday, May 14, 2024

స్కూల్ ఫీజుల వేధింపులు.. హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన శివ బాలాజీ..

- Advertisement -
- Advertisement -

 Actor Shiva balaji complaints on Online Classes in HRC

హైదరాబాద్: మహమ్మారి క‌రోనా కారణంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తెరిచుకోలేదు. దీంతో విద్యాసంవత్సరం కోల్పోకుండా విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయా పాఠశాలు, కాళాశాలలు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభించాయి. అయితే, పలు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులను వసూల్ చేస్తున్నాయి. తాజాగా సినీ నటుడు శివ బాలజీకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్(హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శివబాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మౌంట్ లిటేరా జీ స్కూల్’ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా అధిక మొత్తంలో డ‌బ్బు వ‌సూళ్లు చేస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు అన‌వ‌స‌రంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎందుక‌ని ప్ర‌శ్నించినందుకు తన పిల్ల‌లు ఆన్‌లైన్ క్లాసులు వినకుండా ఐడీల‌ను బ్లాక్ చేసింది. దీనిపై యాజ‌మాన్యాన్ని హెచ్చరిస్తే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌ు. ఇది తన ఒక్క‌డి ప‌రిస్థితి కాదు.. తనలా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నార‌ు’ అని పేర్కొన్నారు.

 Actor Shiva balaji complaints on Online Classes in HRC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News