Tuesday, May 7, 2024

త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న హన్సిక

- Advertisement -
- Advertisement -

 

Hansika Motwani

హైదరాబాద్: ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హన్సిక త్వరలో పెళ్లిచేసుకోబోతోందని వార్త. బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్‌ హీరోలతో జతకట్టి స్టార్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న హన్సికకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఆమె కోలీవుడ్‌పై ఫోక్‌స్‌ పెట్టింది. లేడీ ఓరియంటెడ్‌, గ్లామర్‌ రోల్స్‌ పోషిస్తూ తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. రెండేళ్ల గ్యాప్‌ అనంతరం ఆమె నటించిన తాజా చిత్రం మహా. త్వరలోనే ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించబోతోంది ఆమె. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలను అందుకుంటున్న హన్సిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి.

సౌత్‌కు చెందిన ఓ బడా పోలిటీషియన్‌ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ఫిలిం దూనియాలో వినికిడి. అయితే ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతిత్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని వినికిడి. అయితే చక్కర్లు కొడుతున్న ఈ టాక్ లో నిజమెంతో ఇంకా ధృవపడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News