Saturday, April 27, 2024

కథే నాకు ముఖ్యం

- Advertisement -
- Advertisement -

మలయాళ మూవీ ‘ఓరు ఆధార్ లవ్’తో హీరోయిన్‌గా పరిచయమైన ప్రియా ప్రకాష్ వారియర్… ఒకే ఒక్క కన్ను గీటుతో ‘వింక్‌గాళ్’గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్… హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి యస్.యస్.రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 30న ‘ఇష్క్’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రియా ప్రకాష్ వారియర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
వెంటనే అంగీకరించా…
మలయాళ ‘ఇష్క్’ చిత్రాన్ని చూశాను. ఈ చిత్రంలోని కథ, థ్రిల్లింగ్ అంశాలు నచ్చాయి. దీంతో ‘ఇష్క్’ సినిమా తెలుగు రీమేక్‌కు వెంటనే అంగీకరించాను. ఈ సినిమా రొటీన్ లవ్‌స్టోరీలా ఉండదు. ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది.
అతను చాలా యాక్టివ్…
హీరో తేజ మంచి కో స్టార్. అతను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సెట్స్‌లో ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ సెట్ అంతటినీ లైవ్‌లో ఉంచుతాడు. నాకు తెలుగు డైలాగ్స్ విషయంలో బాగా హెల్ప్ చేశాడు.
పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు…
ఈ చిత్ర దర్శకుడు యస్.యస్.రాజు సహకారం వల్ల మరింత బాగా నటించగలిగాను. ‘మలయాళ వర్షన్‌లోని హీరోయిన్‌ను మర్చిపో..నీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చెయ్’ అని దర్శకుడు రాజు నాతో చెప్పారు. నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించగలిగాను. సూపర్‌గుడ్ ఫిలింస్ వంటి పెద్ద బ్యానర్‌లో నేను నటించడం చాలా సంతోషంగా ఉంది.
టాలీవుడ్ నా సెకండ్ హోమ్…
కథ, పాత్ర ప్రాధాన్యత నన్ను కొత్త సినిమాను అంగీకరించేలా చేస్తాయి. కథే నాకు ముఖ్యం. ఇక తెలుగు భాషను నేను అర్థం చేసుకోగలను. భవిష్యత్‌లో పూర్తిగా తెలుగులో మాట్లాడతానన్న నమ్మకం ఉంది. టాలీవుడ్ నా సెకండ్ హోమ్.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వరలోనే మేకర్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. అలాగే మలయాళంలో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కోసం చూస్తున్నాను. ఇక హిందీలో రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ రావాల్సి ఉంది.

Actress Priya Prakash Varrier Special Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News