Friday, May 3, 2024

ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నా

- Advertisement -
- Advertisement -

Adah Sharma is playing title role in Man to Man movie

 

ఈ మధ్య బాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. వీర్యదానం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘విక్కీ డోనర్’ మంచి హిట్ అయింది. ఇక తాజాగా లెస్బియన్ కథాంశంతో రూపొందిన ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా లింగమార్పిడి కథాంశంతో ఒక మూవీ తెరకెక్కుతోంది. ఆ సినిమానే ‘మ్యాన్ టు మ్యాన్’. ఈ సినిమాలో ‘హార్ట్ ఎటాక్’ బ్యూటీ అదా శర్మ టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన అదా శర్మ పాత్ర.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. కానీ ఈ విషయం తెలియని హీరో నవీన్ కస్తూరియా అదాను పెళ్ళి చేసుకుంటాడట.

పెళ్లయిన తర్వాత ఆమె కథ తెలుసుకున్న భర్త ఖంగు తింటాడని సమాచారం. లింగమార్పిడిపై మన సమాజంలో ఉన్న చిన్నచూపు.. అలాంటి శస్త్రచికిత్స ద్వారా మారిన వ్యక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను ఎంటర్‌టైనింగ్‌గా ఈ చిత్రంలో చూపిస్తున్నారు. అదే సమయంలో అంతర్లీనంగా ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ దర్శకుడు అబీర్‌సేన్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఆదా మాట్లాడుతూ.. “మ్యాన్ టు మ్యాన్ చిత్రంలో ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నా. నా కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది”అని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News