Tuesday, May 14, 2024

ఆరుగురు మేల్ లీడ్స్, ఆరుగురు ఫిమేల్ లీడ్స్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా మాత్రమే కాకుండా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను ప్రారంభించి సమర్పకుడిగా వ్యవహరిస్తూ ప్రశాంతి తిపిర్‌నేని నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ, హిట్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన నాని ఇప్పుడు ‘మీట్ క్యూట్’ అనే అంథాలజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నాడు. జూన్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఐదు కథల సంకలనంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ అంథాలజీలో రోహిణి, ఆదాశర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైన, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మ సూర్య, రాజా… ఇలా ఆరుగురు మేల్ లీడ్స్, ఆరుగురు ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.

6 male and 6 female actors lead role in Meet Cute

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News