Monday, April 29, 2024

టీమిండియా 125/4

- Advertisement -
- Advertisement -

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారీ వర్షం కారణం గా గురువారం రెండో రోజు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో మధ్యలోనే మ్యాచ్‌ను నిలిపి వేశా రు. ఆట నిలిపి వేసే సమయానికి ఓపెనర్ కెఎల్. రాహుల్ 57, వికెట్ కీపర్ రిషబ్ పంత్ 7 పరుగుల తో క్రీజులో ఉన్నారు. ఇక రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్. రాహుల్ అండగా నిలిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగా రు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసి న ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. రోహిత్, రాహుల్‌లు సమర్థంగా ఆడుతూ శుభారం భం అందించారు. కుదురుగా బ్యాటింగ్ చేసిన రోహి త్ ఆరు ఫోర్లతో 36 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చి న చటేశ్వర్ పుజారా (4), కెప్టెన్ కోహ్లి (0), అజిం క్య రహానె (5) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో నాలుగు వికె ట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమం లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన మూడో బౌలర్ అనిల్ కుంబ్లే (భారత్) సరసన నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే టీమిండియా మరో 58 పరుగులు చేయాలి.

IND vs ENG 1st Test: IND 124/5 at stumps on day 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News