Friday, May 10, 2024

సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం

- Advertisement -
- Advertisement -

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం

బెంగళూరు : చంద్రయాన్ -3 ప్రయోగాన్ని విజయవంతంగా నెరవేర్చిన ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయో గం చే పట్టనున్నది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. “ ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. పీఎస్‌ఎల్‌వీ సి57 వాహకనౌక.. ఆదిత్య ఎల్1ను మో సుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థలసాయంతో ఇస్రోసౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.

ఆదిత్యఎల్ 1 విశేషాలివే…
* సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. 1500 కిలోల బరువున్న శాటిలైట్ ఇది.
* భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం లోని లాగ్రాంజ్ పాయింట్ 1(ఎల్ 1) చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ కక్ష లోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.
*  ఆదిత్య ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్ల నుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (విఈఎల్‌సి) తోపాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ , ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే  స్పెక్ట్రోమీటర్ హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు.
* సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోని పొరలైన ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.
*  ఎల్ 1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్టా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు … సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News