Tuesday, April 30, 2024

ఉరివేసుకున్న ఆత్మహత్య ఘటనే

- Advertisement -
- Advertisement -

Aiims team concludes on Sushant death

 

సుశాంత్ మరణంపై ఎయిమ్స్ టీం ముగింపు

న్యూఢిల్లీ : నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఉరివేసుకున్న సంఘటన, తనకు తాను ప్రాణాలు తీసుకోవడం(ఆత్మహత్య)తో సంభవించిన మరణం అని ఎయిమ్స్ వైద్య మండలి తెలిపింది. సుశాంత్ సింగ్ మృతి వ్యవహారం వివాదాస్పదం అయి, సిబిఐ ఆ తరువాత ఇడి, ఎన్‌సిబి దర్యాప్తు వరకూ కేసు సాగింది. విచారణ సాగిస్తున్న సిబిఐకి ఈ వైద్యమండలి తన నిర్ణయాత్మక మెడికో లీగల్ ఒపినియన్‌ను శనివారం తెలియచేసింది. ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు ఫోరెన్సిక్ డాక్టర్ల పరిశీలనలో వెల్లడైన అంశాలను సంస్థకు చెందిన ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా తెలియచేశారు. విషప్రయోగం, లేదా గొంతునులమడంతో మృతి సంభవించిందనే వాదనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇది పూర్తిగా ఉరివేసుకున్న చర్యతో సంభవించిన మరణపు ఘటనగా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని దర్యాప్తు జరుపుతోన్న సిబిఐకి తమ పూర్తిస్థాయి నివేదికను అందించామని డాక్టర్ గుప్తా తెలిపారు.

సుశాంత్ పోస్టుమార్టం నివేదికను ప్రాతిపదికగా తీసుకుని నివేదిక రూపొందించారు. ప్రస్తుత కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ మెడికల్ బోర్డుకు కూడా ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉరితాలూకు గాయం తప్ప శరీరంపై ఇతరత్రా ఎటువంటి గాయాలు లేవు. అంతేకాకుండా పెనుగులాట, తగవుపడ్డట్లు కూడా తెలిపే ఎటువంటి గుర్తులు లేవు. ఈ విషయాన్ని తమ నివేదికలో పొందుపర్చినట్లు తెలిపారు. అయితే ఇంతకు మించి వివరాలను వెల్లడించడం ఈ కేసు విషయంలో చట్టవ్యతిరేకం అవుతుందని తెలిపారు. బాగా వృద్ధిలోకి వస్తున్న దశలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.

ఘటనపై దర్యాప్తు విషయంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్రస్థాయి వివాదం నెలకొంది. చివరికి కేంద్ర ప్రభుత్వ సమ్మతి, సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో సిబిఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. ఈ వారారంభంలోనే సిబిఐ సుశాంత్ కేసు గురించి తాము ఎటువంటి తుది నిర్ణయానికి రాలేదని తెలిపింది. ఇది ఆత్మహత్యనా? ఇతరత్రా జరిగిందా? ఘర్షణ జరిగిన దశలో ప్రాణాలు కొల్పొయ్యాడా? లేక విష ప్రయోగం ఏదైనా మాదకద్రవ్యాలలో కలిపి ప్రాణాలు తీశారా? అనే పలు అనుమానాలు తలెత్తుతున్న దశలో ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సిబిఐ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News