Tuesday, April 30, 2024

తండాల సంపూర్ణ అభివృద్ధే లక్షం

- Advertisement -
- Advertisement -
  • జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్

రాయికల్: ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జిపిలుగా మార్చడమే కాకుండా సంపూర్ణ అభివృద్ధ్దికి తోడ్పాటును అందిస్తామని తెలిపారు.

రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామంతో పాటు జగన్నాథ్‌పూర్, మరాఠగూడెం, చెలకగూడెం తదితర తండాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అంతకుముందు బోర్నపెల్లి గ్రామంలో మీరు నేను కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి కొన్ని సమస్యలను పరిష్కరించారు. వార్డుల్లో కాలినడకన పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసేందుకు బిఆర్‌ఎస్ సర్కార్ సిద్ద్దంగా ఉందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధ్ది చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోర్నపెల్లి గోదావరిపై వంతెన నిర్మించినట్లు చెప్పారు.

రైతులు, మహిళలు, యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించినట్లు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడ్యా సంధ్యారాణి, జెడ్పిటిసి జాదవ్ ఆశ్విని, ఎంపిటిసి కవిత శ్రీనివాస్, సర్పంచ్‌లు పాదం లతరాజు, ఆత్రం విజయబీర్‌సావ్, పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

బిఆర్‌ఎస్‌లో చేరికలు

మండలంలోని మరాఠిగూడం, చెలకగూడెంలలో పర్యటించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. బిఆర్‌ఎస్ గ్రామాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గుగ్గిళ్ల వెంకటేష్, దంటికి రాజేశం, యాదగిరి, నవీన్, వెంకటేష్‌లు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News