Saturday, May 4, 2024

కర్నాటక గవర్నర్‌కు చేదు అనుభవం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిర్‌ఆసియా విమానంలో ప్రయాణించాలనుకున్నారు. సకాలంలోనే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తన లగేజ్‌ని చెక్ చేయించుకుని, బోర్డింగ్ గేట్‌కు చేరుకునేలోగానే ఆ విమానం గాలిలో ఎగురుతూ వెళ్లిపోవడంతో అవాక్కయ్యారు. దీనిపై అధికారులు ఈ విమానాశ్రయంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. థావర్‌చంద్ గెహ్లాట్ గురువారం మధ్యాహ్నం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లోని రెండో టెర్మినల్ నుంచి ఎయిర్‌ఆసియా విమానంలో హైదరాబాద్ వెళ్లవలసి ఉంది.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రాయచూరు వెళ్లి, కాన్వకేషన్‌లో పాల్గొనవలసి ఉంది. గవర్నర్ బృందంలోని అధికారులు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌ఆసియా అధికారులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఎయిర్‌ఆసియా స్పందిస్తూ విడుదల చేసిన ప్రకటనలో, గవర్నర్‌కు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులు గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News