Saturday, April 27, 2024

ముందుగా అనుకున్నట్టుగానే…

- Advertisement -
- Advertisement -

Akkineni akhil act in Agent movie

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సరెండర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, – సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని ప్రారంభిస్తూ.. ఈ ఏడాది డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా టాలీవుడ్‌లో సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. ఆ మధ్య వరుసపెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటించిన వారందరూ ఇప్పుడు తదుపరి మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా మాత్రం ముందుగా ప్రకటించిన తేదీకే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు వచ్చి మళ్లీ లాక్ డౌన్ పెట్టకపోతే.. డిసెంబర్ 24న ‘ఏజెంట్’ను థియేటర్లలోకి తీసుకొచ్చేలా దర్శక నిర్మాతలు షూటింగ్ ప్లాన్ రెడీ చేశారని తెలిసింది. ఇదే కనుక జరిగితే ఈ ఏడాది ముందు ప్రకటించుకున్న తేదీకి రిలీజ్ అయ్యే క్రేజీ మూవీ ‘ఏజెంట్’ మాత్రమే అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News