Wednesday, October 9, 2024

శక్తివంతమైన పాత్రలో…

- Advertisement -
- Advertisement -


కన్నడ నటుడు రామచంద్ర రాజు ‘కేజీఎఫ్’ సినిమాలో ప్రతినాయకుడు ‘గరుడ’ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఇతర భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న ఆయన ఇప్పుడు ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ శక్తివంతమైన పాత్రను గరుడ రామ్ పోషిస్తున్నాడు. తాజాగా అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ‘కేజీఎఫ్ గరుడ’ తరహాలోనే రామచంద్ర రాజు భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ కన్నడ నటుడికి ఈ సినిమా తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చేలా అనిపిస్తోంది. కాగా యువ హీరో శర్వానంద్, – ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఫైనల్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, – అను ఇమ్మాన్యుయేల్‌లు ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News