Friday, May 3, 2024

డిటెక్టివ్‌గా సునీల్

- Advertisement -
- Advertisement -

Sunil act in detective role
హీరో కమ్ కమేడియన్ సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘కనబడుటలేదు’. ఎం.బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరోయిన్ శ్రీదివ్య రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు. ఈ టీజర్ సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగింది. ఈ కథ నగరంలో వరుస హత్యల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ సునీల్‌ను కేసుని పరిష్కరించడానికి ప్రయత్నించే డిటెక్టివ్‌గా పరిచయం చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News