Tuesday, May 7, 2024

జర్నలిస్టు భవన్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు

- Advertisement -
- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
చేసిన టియూడబ్ల్యూజే నాయకులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టులకు తీపి కబురు అందించింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టు భవన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం జర్నలిస్టు భవన్ కోసం స్థలం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవన నిర్మాణం కోసం ఉప్పల్ భగాయత్ లేదా కోకాపేట్‌లో భూమి కేటాయించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెసిడెంట్ అల్లం నారాయణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ భవన్ కోసం హెచ్‌ఎండిఏ 1847.82 చదరపు మీటర్ల విస్తీర్ణం గల భూమిని గుర్తించిందని ప్రభుత్వం పేర్కొంది. ఉప్పల్ భగాయత్ లే ఔట్, ఉప్పల్ (ఎం)లో ఫేజ్-1 ప్లాట్ నెం.7 లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూమిని రిజర్వ్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. మెట్రోపాలిటన్ కమిషనర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటారని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
మంత్రి కెటిఆర్, అల్లం నారాయణకు కృతజ్ఞతలు
టియూడబ్ల్యూజే  భవనానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఆ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టియూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి కెటిఆర్‌కు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఐదు సంవత్సరాలుగా యూనియన్ నాయకులు, జర్నలిస్టు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృషి, యూనియన్ ఉపాధ్యక్షుడు రమేష్ హజారే చూపిన చొరవ వల్ల, ఇది సాధ్యమైందని అల్లం నారాయణ వారన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్‌కు అనుబంధంగా ఉన్న జర్నలిస్టు సంఘాలకు, జర్నలిస్టు కార్యక్రమాలకు తెలంగాణ జర్నలిస్టు భవన్ కేంద్రంగా ఉంటుందని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News