Monday, April 29, 2024

తల్లి ఆందోళన పిల్లల చదువుకు అడ్డంకి కారాదు : ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పిల్లల క్షేమం కోసం తల్లి ఆందోళన చెందడం అతిగా ప్రస్తావించలేం కానీ పిల్లల గురించి ఆమె మానసికంగా వేదన చెందడాన్ని చదువులకు అడ్డంకిగా చేయవలసిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. బ్రిటన్ లోని స్కూళ్లకు తమ పిల్లలను పంపేందుకు ఒక మహిళ, ఆమె విడిపోయిన భర్త కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇందులో ఆమె జోక్యం చేసుకోరాదని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తన పరిశీలన వెల్లడించింది. పిటిషన్ దాఖలు చేసిన మహిళ తన భర్త విడిపోవడంతో తన ఇద్దరు పిల్లలు మానసికంగా ఆవేదన చెందుతున్నారని అందువల్ల ఇక్కడి బ్రిటిష్ స్కూలులో వారిని అడ్మిట్ చేయడం కానీ, లేదా బ్రిటన్‌లో ఉన్న ఇదే స్కూలుకు పంపడం కానీ చేయాలని వాదించింది. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సురేష్ కుమార్ కైట్ నేతృత్వం లోని ధర్మాసనం ఆ పిల్లలను ఆ ఇంటి లోని అనారోగ్య వాతావరణం నుంచి వేరు చేసి సరైన బోధన అందించే ఆరోగ్యకరమైన అభివృద్ధి ఉన్న చోటుకు పంపడం అన్నది ఆ పిల్లల ఆసక్తి,

క్షేమం బట్టి ఆధారపడి ఉంటుందని వివరించింది. పిల్లలతో పరస్పర సంబంధం ఆధారంగా కోర్టు వారు విదేశాల్లో చదవాలనే ఆసక్తిని చూపిస్తున్నారని గ్రహించింది. ఆమేరకు వారికి అడ్మిషన్ల కోసం ప్రయత్నించాలని సూచించింది. భార్యాభర్తల మధ్య గొడవల వల్ల ఇంటిలో వాతావరణం ఉద్రిక్తంగా మారి పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధిపై విపరీత ప్రభావం చూపిస్తుందని కోర్టు తన ఆదేశంలో ప్రస్తావించింది. పిల్లలను చూడడానికి బ్రిటన్ తాను వెళ్లడానికి ఖర్చులనీ భర్తే భరించాలన్న భార్య అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బ్రిటన్‌కు వెళ్లాలన్న ఆమె కోరికను పిల్లల క్షేమానికి సంబంధించిందిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. అయితే సరైన విధానంలో దీనిపై అభ్యర్థన కోర్టు దృష్టికి తీసుకు వచ్చే స్వేచ్ఛ ఆమెకు ఉందని కోర్టు సూచించింది. పిల్లల తండ్రి నుంచి ఖర్చులు భరించాలని కోరే బదులు ఆమె తన కోరిక మేరకు పిల్లలను కలుసుకోడానికి ఏర్పాట్లు ఆమె స్వయంగా చేసుకోవాలని సలహా ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News