Saturday, February 4, 2023

కేరళ విద్యార్థిని చదువుకు అల్లు అర్జున్ సాయం

- Advertisement -

 

కేరళ : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ తాను హీరోనని నిరూపించుకుంటున్నారు. కేరళలో ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అయ్యే విద్యార్థినికి అండగా నిలిచారు. అలెప్పీ జిల్లా కలెక్టర్ వి.ఆర్ క్రిష్ణ తేజ అభ్యర్థనకు స్పందించిన బన్నీ ముస్లిం విద్యార్థి చదువు పూర్తి అయ్యే వరకు ఆర్థికంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ట్యూషన్ ఫీజుతో పాటు నాలుగేళ్ల పాటు హాస్టల్ ఖర్చు భరిస్తానని బన్నీ మాటిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో అల్లు అర్జున్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో మంచి పాలోయింగ్ ఉంది. తరుచూ కేరళ ప్రజలతో బన్నీ టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో కేరళ ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడ బోర్డ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరయిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles