Saturday, April 27, 2024

చెన్నై వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) కరపత్రం, బాంబు తయారీ నోట్స్ కలిగి ఉన్నందుకు చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరి ఇద్దరిని నిర్బంధించారు. ఆ ముగ్గురు వ్యక్తులు చెక్‌పాయింట్లను తప్పించుకు తిరుగుతుండడంతో అనుమానించిన పోలీసులు వారిని పట్టుకున్నట్లు గురువారం తెలిపారు. వారి బ్యాగులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఐసిస్ కరపత్రం, బాంబు తయారీ రసాయనాల నోట్స్ వారికి దొరికాయి. వాటిని యూట్యూబ్ ట్యుటోరియల్ వీడియోల నుంచి గ్రహించినట్లు కూడా తెలిసింది.

అరెస్టు చేసిన నాగూర్ మియాపై ఐపిసి 153ఏ, 505(1)(బి), 505(2) సెక్షన్లు నమోదుచేశారు. దర్యాప్తును కొనసాగిస్తున్నా. ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు అందుకున్న షకుల్ హమీద్ అనే ఐసిసి ఆపరేటివ్‌ను సెప్టెంబర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చెన్నైలో అరెస్టు చేసిన విషయం కూడా ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News