Sunday, May 19, 2024

మూడు రోజుల తర్వాత అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ము స్థావరం నుంచి అమర్‌నాథ్ యాత్ర మళ్లీ మంగళవారం ప్రారంభమైంది. రాంబన్ సెక్షన్‌లో జమ్ముశ్రీనగర్ జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా మూడు రోజుల పాటు ఈ రూటులో యాత్రను రద్దు చేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో మళ్లీ యాత్రికులను అనుమతించారు. సాధారణంగా ప్రతిరోజూ తెల్లవారు జాము 3.45 గంటల నుంచి 4. 30 గంటల మధ్య కాలంలో యాత్రికులను పంపుతుంటారు. కానీ మూడు రోజుల పాటు యాత్రను రద్దు చేయడంతో దాదాపు 15 వేల మంది యాత్రికులు చిక్కుకు పోయారు. జమ్ము లోనే ముఖ్యంగా భగవతీనగర్ స్థావరం లోనే దాదాపు 8 వేల మంది ఆగిపోవలసి వచ్చింది. అలాగే చందర్‌కోట్ స్థావరంలో 6000 మంది ఉండిపోయారు. కతువా, సాంబా స్థావరాల్లో దాదాపు 2000 మంది ఆగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News