Tuesday, April 30, 2024

ప్రపంచంలోనే తెలంగాణ వైద్యరంగంలో అద్భుతమైన ప్రగతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో తీసుకున్న చర్యల కారణంగానే వైద్య రంగం అద్భుతమైన ప్రగతి సాధించామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం‘ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందంజ లో ఉంది అన్నారు.మిగతా రాష్ట్రాల్లో 20, 30 ఏళ్ళు పాలించిన వారి హయాంలోనూ ఇలాంటి అభివృద్ధి లేదని,2014 కు ముందు, ఆ తర్వాత జరిగిన అభివృద్ధి లో మార్పును గమనించాలని కోరారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వైద్య రంగంలో గణనీయంగా అభివృధ్ది చెందిందన్నారు. రెండు మెడికల్ కాలేజీలు, నల్గొండ,సూర్యాపేట లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మెడికల్ సీట్లు సహ ఆసుపత్రులలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు అని అన్నారు. ఆనాడు కేవలం నల్గొండ ఆస్పత్రిలో 36 డాక్టర్లు ఉంటే ఈరోజు 239 మంది ఉన్నారు. ఆనాడు జిల్లాసుపత్రి పక్కన ఉన్నోల్లు సైతం ప్రైవేట్ హాస్పిటల్ కు పోయారని, ఆనాడు పిహెచ్‌సి లలో వైద్యం దిక్కులేదు.. ఈనాడు పిహెచ్‌సిలలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఆనాడు ఏరియా ఆసుపత్రిలో 5 నుంచి 10 ఓపిలుంటే.. నేడు 200 పైగా ఓపిలకు పెరిగాయని వివరించారు. ఏరియా ఆసుపత్రిలలో కూడా డయాలసిస్ జరుగుతుందన్నారు.

నేడు జిల్లాసుపత్రులలో.. తెలంగాణ డయాగ్న స్టిక్ హబ్లో 60కి పైగా ఉచిత వైద్య పరీక్షల మహిళలకు ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికీ తిరిగి మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందని అన్నారు. దేశంలో మాతృ మరణాల సంఖ్యలో తెలంగాణలో గణనీయంగా తగ్గింది. తెలంగాణ లో 1లక్ష మందిలో 2014 లో 92 నుండి 2022 లో 43కు తగ్గాయి, జిల్లాలో 96 నుండి 40 కు తగ్గినట్లు, కానీ దేశం సగటు 97 గా ఉంది అన్నారు. శిశు మరణాలు రేటు 2014 లో ప్రతీ వెయ్యికి మంది పిల్లల్లో 39మరణిస్తే నేడు 2022 లో ఆ సంఖ్య 21 మందికీ తగ్గింది.దేశ సగటు 2022 లో 28 గా ఉంది అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఎం.బి.బి.ఎస్ సీట్లను 850 నుండి 2815 కు పెరిగాయి అంటే 124 శాతం పెరిగాయి పి.జి.సీట్లు 515 నుండి 1216 కు పెరిగాయి అంటే 111 శాతం పెరిగాయి అన్నారు. ఆనాడు 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. నేడు ఆ సంఖ్య 26 కి పెరిగింది. డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషితో.. తెలంగాణ వైద్య రంగం గననీయమైన అభివృద్ధి జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఉదాహణకు కొన్ని సంఘటనలు మంత్రి గుర్తు చేశారు. గుజరాత్ లో.సామాన్య వ్యక్తిగా వెళ్ళి.. ఆవు కోనుగోలుకోసం వెళ్లిన తనకు ఆ రాష్ట్రంలో.. వైద్య పరస్థితి అధ్వానంగా ఉందని తెలుసుకున్నారు. అక్కడి ప్రజలకు కిడ్నీ జబ్బు వస్తె ప్రభుత్వం పట్టించుకునే దిక్కు లేదన్నారు. గుజరాత్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్య సౌకర్యాలు లేవు.

గుజరాత్ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఆయన వివరించారు. దేశంలో పట్టణాలు, పల్లెల్లో 30 నుంచి 40 % తెలంగాణకే అవార్డులు వస్తున్నాయి అంటే అది మన అద్భుత విజయం అన్నారు. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రగతి నివేదికను చదివి ప్రజలకు అవగాహన కల్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందచేశారు.కెసిఆర్ కిట్టు, కంటి వెలుగు లబ్దిదారులతో మాట్లాడించారు. చివరిలో ఎమ్మెల్యే చేత బహుమతుల ప్రదానం, సన్మానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుష్బు గుప్తా, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఎంపీపీలు విజయలక్ష్మి, కరీం పాషా, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు వెంకటరెడ్డి, పూజిత శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రాజ కుమారి,ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్,డిప్యూటీ డి.యం.హెచ్. ఓ వేణు గోపాల్ రెడ్డి, నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్ సంగీత లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News