Thursday, November 7, 2024

జంతువుల స్వాధీనంపై నిబంధనలు ఉపసంహరించండి: సుప్రీంకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

జంతువుల స్వాధీనంపై నిబంధనలు ఉపసంహరించండి:కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: మూగ జీవాలపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణ సందర్భంగా వ్యాపారులు, రవాణాదారుల నుంచి జంతువులను స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి 2017లో జారీచేసిన నిబఃదనలను ఉపసంహరించడం లేదా సవరించడం చేపట్టాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నిబంధనలు చట్టానికి భిన్నంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ చట్టం కింద ఏ వ్యక్తికైనా శిక్ష పడిన పక్షంలోనే జంతువులను స్వాధీనం చేసుకోవాలని చట్టం నిర్దేశిస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది. 2017లో జారీచేసిన నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవడం లేదా సవరించడం చేయని పక్షంలో వీటి అమలుపై స్టే ఇస్తామని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది. సంబంధిత వ్యక్తులకు జంతువులు జీవనాధారమని చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పశువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తికి శిక్ష పడే వరకు వేచి చూడడం తగదని ధర్మాసనం పేర్కొంది.

Amend 2017 rules on possession of animals: SC order

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News