Friday, May 17, 2024

అమెరికాకు అసాంజె అప్పగింత కుదరదు: బ్రిటన్ కోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

Assange cannot extradited to America: Britain Court

లండన్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను అమెలరికాకు అప్పగించ డానికి బ్రిటన్ కోర్టు సోమవారం నిరాకరించింది. అసాంజె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయనను అమెరికాకు అప్పగించడం కుదరదని కోర్టు తేల్చివేసింది. అసాంజెను అమెరికాకు అప్పగిస్తే ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని జిల్లా జడ్జి వెనెస్సా బరేట్సర్ అభిప్రాయపడ్డారు. కాగా. ఈ తీర్పుపై తాము పైకోర్టుకు అప్పీలుకు వెళతామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అసాంజెపై 17 గూఢచర్యం ఆరోపణలతోపాటు కంప్యూటర్ దుర్వినియోగం ద్వారం దశాబ్దం క్రితం తమ దేశ సైనిక, దౌత్యపరమైన పత్రాలను ప్రచురించారన్న ఆరోపణ ఉందని అమెరికా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అభియోగాలు రుజవైతే అసాంజెకు గరిష్టంగా 175 ఏళ్ల జైలుశిక్ష పడుతుందన్నది అమెరికా వాదన. కాగా ఆస్ట్రేలియన్ పౌరుడైన అసాంజె తరఫు న్యాయవాదులు మాత్రం అసాంజె ఒక జర్నలిస్టుగా తన బాధ్యతలు నిర్వర్తించాడని, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైన్యం పాల్పడిన అక్రమాలను వెలికితీసిన పత్రాలను ప్రచురించే స్వేచ్ఛ ఆయనకు ఉందని వాదించారు. అయితే అసాంజె తరఫు న్యాయవాదుల వాదనతో జడ్జి ఏకీభవించలేదు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛగా వీటిని పరిగణించలేమని, నేరారోపణలు రుజువైతే ఆయన శిక్షార్హుడేనని ఆమె స్పష్టం చేశారు. అయితే, అసాంజె మానసిక కుంగుబాటును ఎదుర్కొంటున్నారని, అమెరికా జైలులో ఆయన ఏకాంతంగా ఉంటే అది మరింత తీవ్ర పరిస్థితికి దారితీయగలదని జడ్జి అభిప్రాయపడ్డారు.

Assange cannot extradited to America: Britain Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News