Friday, April 26, 2024

కరోనా తొలి మందు అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

America approves Remdesivir for corona treatment

 

రెమ్‌డెసివిర్‌కు అమెరికా అనుమతి

వాషింగ్టన్ : అమెరికాలో కరోనా చికిత్సకు తొట్టతొలి మందు రెమ్‌డెసివిర్‌కు అధికారికంగా అనుమతి దక్కింది. కోవిడ్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తే ఐవి రూపంలో ఈ యాంటివైరల్ మెడిసిన్‌ను చికిత్సకు ఉపయోగిస్తారు. కాలిఫోర్నియాకు చెందిన ప్రఖ్యాతమైన గిలీడ్ సైన్సెస్ సంస్థ రూపొందించిన ఈ డ్రగ్‌కు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డిఎ) గురువారం వాడకానికి అనుమతిని కల్పించింది. ఇంతవరకూ దీనిని ప్రయోగాత్మకంగా వాడుతూ దీని సమర్థతను పరీక్షిస్తూ వచ్చారు. ఈ ఔషధాన్ని ఉత్పత్తి సంస్థ గిలీడ్ వెక్లురీ రెమ్‌డెసివిర్‌గా పిలుస్తోంది. దీని సాయంతో ఇప్పుడు చికిత్స కాలాన్ని ఇంతకు ముందున్న 15రోజుల నుంచి పదిరోజుల స్థాయికి సగటున తగ్గించవచ్చునని తెలిపారు. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో సమగ్రరీతిలో జరిపిన పలు రకాల అధ్యయనాల తరువాత దీనిని పూర్తి స్థాయి ఔషధంగా వినియోగంలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. కరోనాతో అనారోగ్యానికి గురైన ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ ఔషధం తీసుకున్నారు. దీనితో తాను కోలుకోవడానికి వీలేర్పడినట్లు ప్రకటించారు.

అయితే కనీసం 12 ఏండ్లు అంతకు మించిన వారికే దీనిని వాడాల్సి ఉంటుంది. ఇక కనీసం 40 కిలోల బరువు ఉండే వారిలోనే ఈ మందు బాగా పనిచేస్తుంది. తప్పనిసరిగా ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారి ఔషధ జాబితాలో ఇది ప్రధాన మందుగా చేర్చేందుకు రంగం సిద్ధం అయింది. కోవిడ్ 19తో పోరు విషయంలో ఇప్పుడు ఇటువంటి సాధనసంపత్తితో , సరైన విజ్ఞానంతో తాము ముందుకు సాగుతున్నామని గిలీడ్ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ మెర్డెడ్ పర్సే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డ్రగ్‌కు ఇప్పటికే 50 దేశాలలో వాడకానికి ఆమోదం లేదా తాత్కాలిక అనుమతి లభించినట్లు వివరించారు. అయితే దీని ధర ఎక్కువగా ఉందని, పనితీరు కూడా సరిగ్గా నిరూపితం కాలేదని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News