Tuesday, April 30, 2024

‘హాయ్ నాన్న’ నుంచి ‘అమ్మాడి’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, హాట్ బ్యూటీ, సీతారామమ్ ఫేం మృణాల్ ఠాకూర్ ల కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ  ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు అద్భుత స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని అమ్మాడి అని సాగే మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంతల సూపర్ హిట్ మూవీ ఖుషీ పాటలతో ముజిక్ లవర్స్ ను ఆకట్టుకున్న హేషామ్ అబ్దుల్ వహాబ్.. ఈ సినిమాలోనూ సూపర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ మూవీ టీజర్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News