Wednesday, May 29, 2024

పెళ్లయిన కొత్తలో పెళ్ళాం లేచిపోతే…

- Advertisement -
- Advertisement -

Anand Devarakonda about Pushpaka Vimanam

ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను టీచర్‌గా కనిపిస్తాను. పెళ్లయిన కొత్తలో పెళ్ళాం లేచిపోతే ఒక భర్త పడే ఇబ్బందులు, నలుగురికి విషయం తెలియకుండా దాచిపెడుతూ కవరింగ్ చేసే క్యారెక్టర్‌లో నటించాను. నా క్యారెక్టర్‌తో ఇటు సానుభూతి అటు వినోదం రెండూ వర్కవుట్ అయ్యాయి. సునీల్, నరేష్ పాత్రలు కథలో చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. ముఖ్యంగా సునీల్ ప్రతి విషయాన్ని అనుమానించే పోలీస్ క్యారెక్టర్‌లో నటించాడు. ఆ క్యారెక్టర్‌లో సీరియస్‌నెస్‌తో పాటు ఫన్ కూడా ఉంటుంది. డైరెక్టర్ దామోదర ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం నేను మూడు సినిమాలు చేస్తున్నాను. కెవి గుహన్‌తో ‘హైవే’ చేస్తున్నాను. అది పూర్తి రోడ్ జర్నీ మూవీ. సాయి రాజేష్‌తో ‘బేబీ’ అనే ఇంకో సినిమా చేస్తున్నాను. అలాగే కొత్త డైరెక్టర్‌తో మరో సినిమా ఉంది” అని అన్నారు.

Anand Devarakonda about Pushpaka Vimanam

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News