Tuesday, May 14, 2024

డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెడుతున్న అంకురిట్‌ క్యాపిటల్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: సెబీ నియంత్రణలోని ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌ అంకురిట్‌ క్యాపిటల్‌, సుప్రసిద్ధ న్యూట్రాస్యూటికల్‌ కాస్మెస్యూటికల్‌ ఉత్పత్తుల కంపెనీ డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌లో 7.71% వాటాను సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి 13.30 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌కూ 37.60 రూపాయల ధరతో తమ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూలో భాగంగా డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ కేటాయించింది.

ఈ కేటాయింపులను గురించి ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మింటో పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ ‘‘మా కంపెనీ వృద్ధిలో భారీ మదుపరులు సైతం ఆసక్తి చూపుతుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాలను మిల్లీనియల్స్‌ కోసం గేమిఫైడ్‌ హెల్త్‌, వెల్‌నెస్‌లో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం వినియోగించనున్నాము. ఆన్‌లైన్‌లో మా బ్రాండ్‌ స్ధానం బలోపేతం చేయడంతో పాటుగా ఆర్గానిక్‌ వృద్ధి కోసం శక్తివంతమైన కమ్యూనిటీ నిర్మించనున్నాము. అంతేకాదు, ఈ విభాగంలో ఆధిపత్యం చూపే డీ2సీ ప్లేయర్‌గా కూడా నిలువనున్నాము.

దీనితో పాటుగా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో మా ఉనికిని విస్తరిస్తూనే యుఏఈ, యుఎస్‌ఏ లాంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో సైతం విస్తరించనున్నాము. ప్రస్తుతం యుఎస్‌ఏలో 600 రిటైల్‌ స్టోర్లలో మా ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నాము’’ అని అన్నారు.

అంకురిట్‌ కో–ఫౌండర్‌–మేనేజింగ్‌ డైరెక్టర్‌ నటాషా మాట్లాడుతూ.. ‘‘న్యూట్రాస్యూటికల్స్‌, కాస్మెస్యూటికల్స్‌ రంగంలో ఇప్పటికే అగ్రగామి సంస్థగా డెక్కన్‌ హెల్త్‌కేర్‌ నిలిచింది. ఈ సంస్ధ ఉత్పత్తి చేసిన 90కు పైగా ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. డిజిటల్‌ శక్తివంతమైన డీ2సీ బ్రాండ్‌గా వారి పరివర్తనక మద్దతునందించేందుకు పెట్టుబడులు పెడుతున్నాము’’ అని అన్నారు. డీఎల్‌ఎస్‌ లా ఆఫీసెస్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీప్తి లావ్య స్వాయిన్‌ ఈ పెట్టుబడికి న్యాయ సలహాదారునిగా వ్యవహరించారు.

Ankurit Capital Invest in Deccan Healthcare Ltd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News