Sunday, April 28, 2024

మూడు స్థానాలకు బిఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్
నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి,
భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేశ్ పేర్లను
ఖరారు చేసిన అధినేత కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి మరో మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ తిగుళ్ల పద్మారావు గౌడ్ పేరును అధినేత కెసిఆర్ ప్రకటించారు. నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా క్యామ మల్లేశ్ పేర్లను బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకు ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు బిఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్ పార్లమెంట్‌కు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బిఆర్‌ఎస్ పార్టీ తరపున మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య, నాగర్‌కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్ బరిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News