Monday, April 29, 2024

ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఎపి సిఎం ఆమోదం

- Advertisement -
- Advertisement -

AP CM approves inter-state transfers of government employees

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ కోరుతున్న ఉద్యోగుల వివరాలు సేకరించాయని ఎపి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి ఎపికు 1338 మంది , ఎపి నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు.

ఈ వివరాలతో జిఎడి రాష్ట్ర పునర్విభజన శాఖ ప్రతిపాదన రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించగా ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే అప్పుడు బదిలీలకు సంబంధించిన విధి విధానాలు రూపొందించి బదిలీల ప్రక్రియ చేపడుతారని తెలిపారు. తెలంగాణకు బదిలీలు కోరుకునే వారందరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇపుడు ఎన్‌ఓసి ఇస్తుందని తెలిపారు. త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీలలో తప్పనిసరి బదిలీకి ఎనిమిది సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు. అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News