Thursday, May 2, 2024

ఎపి మాజీ ఎంపి సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

AP Former MP Sabbam Hari health condition is critical

 

మనతెలంగాణ/హైదరాబాద్‌: కరోనా సోకడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపి సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట సబ్బం హరి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే వైద్యుల సూచన మేరకు తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సబ్బం హరి ఆరోగ్యం ఆదివారం నాటికి విషమించినట్టు వైద్యులు చెబుతున్నారు. కరోనాతో పాటు ఇతర ఇన్‌ఫక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News