Saturday, May 4, 2024

ఆక్సిజన్ కోసం ఓ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది నరకయాతన

- Advertisement -
- Advertisement -

ఆక్సిజన్ కోసం ఓ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది నరకయాతన
సరఫరాకు అడ్డుగా ఉన్న గోడను అప్పటికపుడు తొలగించి 100మందికిపైగా కొవిడ్ పేషెంట్లను కాపాడిన వైనం

Amid Oxygen shortage in Jaipur golden hospital

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో కొవిడ్ పేషెంట్లను కాపాడుకోవడానికి యాజమాన్యంతోపాటు, వైద్య సిబ్బంది నరకయాతన పడ్డారు. సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో శనివారం సాయంత్రం 100మందికిపైగా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం కాగా, ఈ పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం పంపిన ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి తమ హాస్పిటల్‌లోని ట్యాంకర్‌లోకి నింపడానికి గోడ అడ్డుగా ఉండటంతో అప్పటికపుడు దానిని తొలగించారు. ఈ ప్రక్రియ పూర్తయేలోగా తమ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించడం కోసం సిబ్బంది, పోలీసులు ఎంతో రిస్క్ తీసుకోవాల్సివచ్చింది.
ఈ సందర్భంగా ఆక్సిజన్ అందక జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో 20మంది పేషెంట్లు చనిపోయిన ఘటన పునరావృత మవుతుందేమోనని ఆందోళన చెందామని హాస్పిటల్ యజమాని పంకజ్‌చావ్లా తెలిపారు. చేసేదేమీలేక పేషెంట్లను వేరే ఆస్పత్రులకు తీసుకువెళ్లాల్సిందిగా వారి బంధువులకు సూచించామన్నారు. దాంతో, 34మంది పేషెంట్లను వారి బంధువులు తీసుకెళ్లారని ఆయన తెలిపారు. వారంతా ఆక్సిజన్ అవసరం లేనివారేనని ఆయన తెలిపారు. ఇంకా 100మందికిపైగా హాస్పిటల్‌లోనే ఉన్నారని, వీరంతా వెంటిలేటర్లపై ఉన్నారని, దాంతో తీసుకువెళ్లేందుకు బంధువులు నిరాకరించారని చావ్లా తెలిపారు. ఎక్కడైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని వారు తమను వేడుకున్నారని చావ్లా తెలిపారు. దాంతో, ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రయత్నించామని ఆయన తెలిపారు.
ఇలాంటి సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పంపిన ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చిందని చావ్లా తెలిపారు. అయితే, దాని సైజ్ పెద్దది కావడంతో తమ హాస్పిటల్‌లోని ట్యాంకర్‌లోకి నింపేందుకు వీలు పడలేదన్నారు. దాంతో, ఆక్సిజన్ నింపడానికి అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని నిర్ణయించామన్నారు. అందుకు కొంత సమయం పడుతుంది. మరోవైపు ప్రభుత్వం పంపిన ట్యాంకర్‌లోని ఆక్సిజన్‌ను సమీపంలోని తీరథ్‌రామ్‌షా అనే మరో హాస్పిటల్‌తో షేర్ చేసుకోవాలి. దాంతో, గోడ కూలగొట్టేలోగా తిరిగి వస్తామని చెప్పి ట్యాంకర్‌ను షా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈలోగా తమ దగ్గరున్న పేషెంట్లను కాపాడుకునేందుకు మరోసారి ఆక్సిజన్ సిలిండర్ల కోసం తమ సిబ్బంది, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చిందని చావ్లా తెలిపారు. చివరికి 20 సిలిండర్లు రావడంతో 40 నిమిషాలపాటు ఆక్సిజన్ అందించగలిగామని చావ్లా తెలిపారు. ఇంతలో గోడ కూలగొట్టి ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ తీసుకున్నామని చావ్లా తెలిపారు. దాంతో, జైపూర్ గోల్డెన్‌లాంటి మరో విషాదం జరగకుండా నివారించగలిగామని చావ్లా సంతోషం వ్యక్తం చేశారు.

Amid Oxygen shortage in Jaipur golden hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News