Saturday, April 27, 2024

ఎపిలో లాక్‌డౌన్ సడలింపు గైడ్‌లైన్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

jagan

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఎపి ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్‌ను బుధవారం విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు కొత్త గైడ్ లైన్స్ విడుదలయ్యాయి. ఇందులో వ్యవసాయ, హార్టీకల్చర్ పనులకు మినహాయింపునిచ్చారు. ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ పనులకు అనుమతిచ్చారు.ఆర్థిక రంగానికి మినహాయింపు నిచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు అనుమతించారు.కావల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు పెర్మిషన్ ఇచ్చారు.వలస కార్మికులకు, రాష్ట్ర పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి లభించింది.అయితే కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది.వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రం లో మాత్రమే పనులకు అనుమతి ఉంటుంది. బుక్స్ షాపులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు ఇచ్చారు. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలోని షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి లభించింది.

AP Govt Release of Lockdown Guidelines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News