Wednesday, May 1, 2024

ప్లాస్మా ఇవ్వండి, విలన్ ముద్ర చెరిపేయండి

- Advertisement -
- Advertisement -

Tabligee Jamaat

 

కొవిడ్ నుంచి కోలుకున్న సభ్యులకు తబ్లీగీ జమాత్ పిలుపు
ప్రభుత్వ అనుమతి కోరిన లక్నో మెడికల్ చీఫ్

లక్నో: కరోనా రోగుల చికిత్సకు తమ ప్లాస్మా ఇవ్వాలని ఆ వ్యాధి నుంచి కోలుకున్న తమ సభ్యులకు తబ్లీగీ జమాత్ పిలుపునిచ్చింది. అలా చేయడంవల్ల తమ సంస్థపై ఉన్న విలన్ ముద్ర తొలగవచ్చని అభిప్రాయపడింది. ‘ఇందుకు సంబంధించి సంస్థ నాయకుడు మౌలానా సాద్ ఏప్రిల్ 21న జమాతీలందరికీ ఒక బహిరంగ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను ఇతర రోగులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులందరికీ ఈ సందేశం అందింది’ అని సంస్థ లక్నో శాఖ మేనేజర్ మౌలానా అనీస్ అహ్మద్ నద్వీ బుధవారం పిటిఐకి చెప్పారు. ‘ఆరోగ్యశాఖ డేటా ప్రకారం కరోనా రోగుల్లో 50 శాతం మంది జమాతీలు.

వారిలో కోలుకున్న 400 మంది జమాతీలను సంప్రదించాం. వారంతా తమ ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దేశంలో కోలుకున్నవారు తమ ప్లాస్మా ఇస్తున్నారు. ప్లాస్మా ఇవ్వకుండా ఎవరూ తప్పించుకోవద్దని మర్కజ్ ఆదేశాలిచ్చింది. ప్లాస్మా ఇవ్వడమంటే ఎవరికో మేలు చేస్తున్నట్టు అనుకోవద్దు. ఇది మానవత్వంతో తీసుకుంటున్న చర్య’ అని నద్వీ చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత జమాతీలను అందరూ విలన్లుగా చూస్తున్నారన్నది నిజం. అలా భావించేవారిని క్షమించాలని మౌలానా సాద్ చెప్పారు’అని వివరించారు. మర్కజ్ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని, అక్కడి నుంచి అనుమతి వచ్చాక జమాతీల నుంచి ప్లాస్మా తీసుకుంటామని లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర అగర్వాల్ చెప్పారు.

 

Tabligee Jamaat asks for members to give plasma
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News