Saturday, April 27, 2024

ఎపిలో పంచాయతీ ఎన్నికలు రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎపి హైకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. ఎస్‌ఇసి నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఇసి నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తాజా తీర్పుతో ఇప్పట్లో ఎఓపిలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టం అయింది. ప్రజారోగ్యం, వ్యాక్సిన్ పంపిణీని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డురాకూడదని కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఇసి షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ షెడ్యూల్‌ను అధికార వైఎస్సార్‌తో సహా, ఎపి ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకించడంతో పాటు కోర్టు ఆశ్రయించాయి. దీంతో ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు షాక్ ఇస్తూ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయడంతో పాటు ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఇసి ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ ప్రభుత్వం సూచనలను ఎస్‌ఇసి పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

AP High Court Cancels Panchayat Elections 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News