Sunday, May 5, 2024

గతేడాది మార్చి బిల్లులనే చెల్లించండి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: లాక్ డౌన్ లో విద్యుత్ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడతూ.. కరెంట్ సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నం. ఎండా కాలంలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది.వినియోగదారులపై ఒక్కపైసా కూడా అదనంగా భారం మోపం. ఆపరేటర్ నుంచి సిఎండి వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. వినియోగదారులు కరెంట్ బిల్లులు ఆన్ లైన్ లో చెల్లించాలి. లాక్ డౌన్ కారణంగా కరెంట్ రీడింగ్ తీయలేకపోతున్నాం. దీంతో గత మార్చిలో వచ్చిన బిల్లులనే తీసుకోవాలని ఈఆర్ సి సూచించిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఎక్కవ మొత్తంలో కరెంట్ ను వినియోగిస్తున్నారు. ఇక, రీడింగ్ తీయలేకపోతుండడంతో గత మార్చి నెలలో ఎంత బిల్లు వచ్చిందో ఇప్పుడూ అంతే బిల్లు కట్టాలని మంత్రి తెలిపారు.

Aprils power bill is same as March: Jagadish Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News