Friday, May 3, 2024

డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ జారవిడిచిన ఆయుధాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

arms recovered

జమ్మూ: పాకిస్థాన్ డ్రోన్ ద్వారా జారవిడిచిన ఆయుధాలను పోలీసులు జమ్మూ అంతర్జాతీయ సరిహద్దు వద్ద సాధీనం చేసుకున్నారు, స్వాధీనం చేసుకన్న ఆయుధాలలో ఎకె అసాల్ట్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 30 రౌండ్లు, టెలిస్కోప్ ఉన్నాయని ఆదివారం అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఫలైన్ మండల్‌లోని సౌంజన గ్రామం వద్ద ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వార తెలిపారు. అక్టోబర్ 2 రాత్రి వేళ డ్రోన్ హమ్మింగ్ ధ్వని, సరకులు జారవిడిచిన శబ్దం వినిపించిందని ఓ గ్రామస్థుడు పోలీసులకు తెలిపాడు. దాంతో పోలీసులు ఆ గ్రామాన్ని వెంటేనే చుట్టుముట్టి, సోదా ఆరంభించారు. అప్పుడే వారికి పసుపు రంగులో ఉన్న చెక్క పెట్టె దొరికింది. అందులో ఆయుధాలున్నాయని అధికారులు చెప్పారు.
పోలీసులు కేసును నమోదు చేసుకుని భారత్‌లో అది ఎవరికీ అందాల్సి ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సర కాలంగా పాకిస్థాన్ నుంచి డ్రోన్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. ఇది సరిహద్దు రక్షక బలగాలకు ఓ సవాలుగా మారింది. సంవత్సరకాలంలో సరిహద్దు భద్రతా బలగాలు వేర్వేరు ప్రాంతాల్లో రెండు డ్రోన్లను పడగొట్టి, పెద్ద ఎత్తున ఆయుధ సరకును స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న వాటిలో రైఫిళ్లు, ఐఇడి, స్టిక్కీ బాంబులు, మాదకద్రవ్యాలు వంటివి ఉన్నాయి.
ఇదిలావుండగా పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా జమ్మూలోని భారత వాయుసేన స్థావరంలో ఈ ఏడాది జూన్ నెలలో రెండు బాంబులను జారవిడిచాక సరిహద్దు వద్ద సెక్యూరిటీ గ్రిడ్‌ను మరింత తీవ్రతరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News