Tuesday, May 14, 2024

భారీ భూకుంభకోణాన్ని బయటపెట్టిన సిఐడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుపతిలో భారీ భూకుంభకోణాన్ని సిఐడి బయటపెట్టింది. నకిలీ పత్రాలు సృష్టించి 2వేల కోట్లకుపైగా విలువ కలిగిన భూములు కాజేసేందుకు ప్రయత్నించిన కేటుగాళ్ళను సిఐడి అదుపులోకి తీసుకుంది. దాదాపు1577ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్ లైన్ లో సొంత పేర్లపై మార్చేశారు. 13మండలాల్లోని 93సర్వే నెంబర్లలో ఉన్న 2,320 ఎకరాల స్థలం పేర్ల మార్చారు. ఒకేరోజు 93 సర్వే నెంబర్లు ఆన్ లైన్ లో మార్చేశారు.నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రధాన నిందితులు మోహన్ గణేష్ పిళ్ళె, మధుసూదన్, రాజన్, కోమల, రమణను అదుపులోకి తీసుకున్న సిఐడి.. నిందితుల నుంచి 40నకిలీ పత్రాల స్వాధీనం చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధమున్న మరో నిందితురాలు ధరణి పరారీలో ఉంది.

CID uncovers massive land scam in Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News