Saturday, May 4, 2024

అభిమానులను ఆకట్టుకుంటున్న ఆసియా కప్ ప్రోమో..

- Advertisement -
- Advertisement -

Asia Cup 2022 Promo Released

న్యూ ఢిల్లీ : ఆసియా కప్2022 టోర్నీ కోసం ప్రచారం ఊపందుకుంది. రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని యుఎఇకి మార్చారు. దీంతో యుఎఇ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. టి20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్‌లో డిజైన్ చేశారు. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ ఇదివరకే అర్హత సాధించాయి. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యుఎఇ మధ్య క్వాలీఫైయింగ్ రౌండ్ నిర్వహించనున్నారు. కాగా, ఈ టోర్నీ ప్రసార హుక్కలను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఆసియా కప్ ప్రోమోను విడుదల చేసింది. 45 సెకండ్ల పాటు సాగిన ఈ ప్రోమో టీమిండియా అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ ప్రోమో సాంగ్‌లో లిరిక్స్ భారత క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ‘మా భారత్ నెంబర్ వన్. ఇప్పుడు మేం ఆసియా కప్‌ను గెలుస్తాం. మా పొరుగుదేశాలు కూడా ఈ టోర్నీని గెలవడానికి ఆరాటపడుతున్నాయి. కానీ సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా మేమిక్కడికి వచ్చింది గెలవడానికే అని మా ప్రత్యర్థులకు చెబుతున్నాం’ అనే అర్థం వచ్చేలా ప్రోమో సాంగ్‌ను డిజైన్ చేశారు. ఈ ప్రోమోలో భారత ఆటగాళ్లతో పాటు పాకిస్థాన్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిది, బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, అఫ్గానిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ కనిపించారు. ఈ టోర్నీలో ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కాగా 1984 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారత జట్టు ఏడుసార్లు ట్రోఫీ నెగ్గింది. శ్రీలంక ఐదుసార్లు గెలుపొందగా పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది.

Asia Cup 2022 Promo Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News