Tuesday, April 30, 2024

రాజస్థాన్‌లో ఉపాధ్యాయ పరీక్షకు బ్లూటూత్ చెప్పులతో.. ఐదుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Attended test with Bluetooth on slippers in Rajastan

రాష్ట్రవ్యాప్త రాకెట్‌ను గుర్తించిన అధికారులు

జైపూర్: రాజస్థాన్‌లో పాఠశాల ఉపాధ్యాయుల ఎంపిక కోసం రీట్ పేరుతో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మోసానికి పాల్పడినందుకు ఐదుగురిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. చెప్పుల్లో(స్లిప్పర్స్‌లో) బ్లూటూత్ పెట్టుకొని పరీక్షకు హాజరైనట్టు గుర్తించి వీరిని అరెస్ట్ చేశారు. మొదట అజ్మెర్‌లోని పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి చెప్పుల్లో బ్లూటూత్ అమర్చుకొని రావడాన్ని అధికారులు గుర్తించారు. అతణ్ని పోలీసులకు అప్పగించి విచారించగా, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి రాకెట్ ఉన్నట్టు బయటపడింది. బికానెర్, సీకర్ పట్టణాల్లోని పరీక్షా కేంద్రాల్లోనూ మరో ఇద్దరు అభ్యర్థులు బ్లూటూత్‌తో పట్టుబడ్డారు. వీరికి సహకరించిన మరో ఇద్దరు బయటివారిని ఈ రాకెట్‌కు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫోన్‌తోపాటు బ్లూటూత్‌ను చెప్పుల్లో పెట్టుకొని, చెవిలో మరో పరికరాన్ని అమర్చుకొని బయటి నుంచి మరో వ్యక్తి ద్వారా పరీక్షా పత్రంలోని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే విధంగా సాంకేతిక అనుసంధానాన్ని ఇందులో గుర్తించామని పోలీస్ అధికారి రతన్‌లాల్ భార్గవ్ తెలిపారు.

ప్రవేశ పరీక్షల్లో మోసాల కోసం ఇలాంటి చెప్పుల్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ రకమైన సాంకేతికత కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల్ని రాకెట్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. రీట్ పరీక్ష కోసం మొత్తం 25 జతల స్లిప్పర్లను ముఠా అమ్మినట్టు గుర్తించారు. ఈ రాకెట్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్నదానిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. మిగతా జిల్లాలను అప్రమత్తం చేయడం ద్వారా మొత్తం రాకెట్ వెలుగులోకి వస్తోందని అజ్మెర్ పోలీస్ అధికారి జగదీశ్‌చంద్రశర్మ తెలిపారు. ఇకముందు ప్రవేశ పరీక్షలకు చెప్పులు, బూట్లు, సాక్స్‌లను అనుమతించమని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News