డార్విన్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ మరోసారి బ్యాట్‌తో చెలరేగాడు. అంతర్జాతీయ టి20ల్లో సౌతాఫ్రికా జట్టుపై ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆసీస్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డ్‌ను అధిగమించాడు. స్వదేశంలో దక్షిణాప్రికాతో జరుగుతున్న మూడు టి20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టి20లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా టీమ్ డేవిడ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన టిమ్ డేవిడ్.. 52 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డెవిడ్ వార్నర్ 2009లో సౌతాఫ్రికాతో జరిగిన టి20 మ్యాచ్‌లో 6 సిక్స్‌లు కొట్టాడు.
తాజా మ్యాచ్‌లో టిమ్ డెవిడ్ 8 సిక్స్‌లు బాది ఆ రికార్డు బద్దలుకొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. టిమ్ డెవిడ్(83)తో పాటు కామెరూన్ గ్రీన్(35) మాత్రమే రాణించాడు. సాఫారీ బౌలర్లలో క్వెన మఫకా నాలుగు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబడా రెండు వికెట్లు దక్కించుకున్నాడు, లుంగి ఎన్‌గిడి, జార్జ్ లిండే, సెనురన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంరతం లక్ష ఛేదనకు దిగిన దక్షిణాఫ్రిక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులే చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో లక్షానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (71), త్రిస్టన్ స్టబ్స్(37)లు మ్రామే రాణించారు.