Tuesday, May 21, 2024

ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ షాక్

- Advertisement -
- Advertisement -

ఢాకా: ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ నయీం రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ మూడు ఫోర్లతో 36 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మహ్మదుల్లా (20), అఫిఫ్ హుస్సేన్ (23) తమవంతు పాత్ర పోషించడంతో బంగ్లా స్కోరు 131 పరుగులకు చేరింది. ప్రత్యర్థి బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 108 పరుగులకే ఆలౌటైంది. మిఛెల్ మార్ష్ (45) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నాసుమ్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముస్తఫిజుర్, సైఫుల్ ఇస్లామ్ రెండేసి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News