Sunday, April 28, 2024

కొవిడ్ కట్టడికి మరో కొత్త ఆయుధం

- Advertisement -
- Advertisement -

Australia tests nasal spray against Covid-19

నేజల్ స్ప్రేను పరీక్షించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ : కొవిడ్ కట్టడికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే హెపరిన్ అనే ఔషధాన్ని వారు పరీక్షించారు. ఇది చాలా చౌకగా లభిస్తుంది. నేజల్ స్ప్రేను వాడి ఓ కొవిడ్ రోగికి ఈ ఔషధాన్ని ముక్కులో పిచికారీ చేశారు. ఆ తరువాత అతని నుంచి ఈ వైరస్ వ్యాపించిన దాఖలాలు లేవని వెల్లడించారు. కానీ ఈ పరిశోధన పూర్తయ్యేందుకు 2022 ద్వితీయార్ధం వరకు సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఒక వ్యక్తికి కొవిడ్ సోకిన తొలినాళ్లలో ఈ స్ప్రే ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతోపాటు వైరస్ వ్యాప్తిని కూడా అరికట్టే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

ఈ ప్రయోగాలు విజయవంతమైతే ప్రజలకు మరో రక్షణ కవచం లభిస్తుందని, రద్దీగా ఉండే షాపింగ్ లేదా ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు వెళ్లే సమయంలో ఈ స్ప్రేను ముక్కులో పిచికారీ చేసుకొన్ని వెళ్లే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న డ్యాన్ క్యాంప్‌బెల్ బీబీసీకి వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక నేజల్ స్ప్రేలను పరీక్షించారు. హెపరిన్‌పై పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఔషధం మార్కెట్లో చాలా సులభంగా లభిస్తుంది. దీన్ని పీల్చినప్పుడు ఇది నేరుగా రక్తంలో కలవకుండా ముక్కు రంధ్రాల్లో ఉంటుంది. వైరస్ దీనికి అతుక్కుని , శరీర కణాల్లోకి ప్రవేశించకుండా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం 3 మిలియన్ డాలర్లను కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News