Tuesday, May 7, 2024

ఆటో సోదరులకు అండగా ఉంటా

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : ఆటో సోదరులకు అన్ని విధాల అండగా నిలుస్తానని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్‌లతో ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతిలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లాలో ఉన్న 5వేల మంది ఆటో డ్రైవర్‌లకు రూ.30లక్షలతో ఆటో యూనియన్ కార్యాలయం, ప్రహారీ నిర్మాణ పనులు, టాయిలెట్స్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
స్థానిక ఆటో సోదరులతో కలిసి గాంధీ చౌక నుండి భూపాలపల్లి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గండ్ర మోహన్‌రెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా లైసెన్స్ లేని ప్రతి ఆటో డ్రైవర్‌కు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తామన్నారు. ఆటో కార్మికులకు గండ్ర మోహన్‌రెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ అందజేస్తామని తెలిపారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరు ప్రభుత్వం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని, ఆటో నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు, రవాణా ప్రమాణాలను పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. ఆటో యూనియన్ ద్వారా ఐకమత్యంగా ఉండాలని, జీవితంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆటో యూనియన్ కార్మికులకు భోజనాలు ఏర్పాటుచేసి స్వయంగా తానే వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News