Wednesday, May 22, 2024

అక్షర్ పటేల్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Axar Patel tests positive for COVID-19

న్యూఢిల్లీ: ఐపిఎల్ కి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు కరోనా వైరస్ సోకింది. అక్షర్ పటేల్ కు కోవిడ్ సోకిందని, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచామని ఢిల్లీ ఫ్రాంఛైజీ తెలిపింది. ఏప్రిల్ 10న చెన్నైతో ఢిల్లీ తలపడనుంది. ఆ మ్యాచ్ కు అక్షర్ దూరం కానున్నాడు. అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అటు కరోనా బారిన పడిన రెండో ఐపిఎల్ ఆటగాడు అక్షర్. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీశ్ రానాకు కరోనా సోకింది. గత 22న పరీక్షల్లో నితీశ్ రానాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఎవరికైనా కరోనా వస్తే తప్పకుండా 10 రోజులు పాటు ఐసోలేషన్ లో ఉండి విశ్రాతి తీసుకోవాలి.

Axar Patel tests positive for COVID-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News