Tuesday, April 30, 2024

బ్యాచిలర్ పార్టీ ఇటలీలో చేస్తా

- Advertisement -
- Advertisement -

Bachelor party in Italy:Jhanvi Kapoor

 

అందాల తార శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ తన అంద చందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటీ. అయితే ఎంత సెలబ్రిటీ అయినా కూడా తను కూడా సాధారణ అమ్మాయి లాగే తన పెళ్లి గురించి కలలు కంటున్నానని చెప్పింది జాన్వీ కపూర్. అయితే పెళ్లి కంటే ముందు బ్యాచిలర్ పార్టీని తప్పకుండా చేసుకుంటానని.. దాన్ని చాలా గ్రాండ్‌గా జరుపుతానని పేర్కొంది. పెళ్లికి ముందు తన స్నేహితులతో కలిసి దక్షిణ ఇటలీలోని కాప్రీ నగరంలో పడవలో బ్యాచిలర్ పార్టీ నిర్వహిస్తానని తెలిపింది. అయితే పెళ్లికి సంబంధించిన వేడుకలు మాత్రం మొదట తన అమ్మమ్మ ఇంటి నుంచే మొదలు పెడతుందట.

శ్రీదేవి సొంత ఊరు తమిళనాడులోని మైలాపూర్ కావడంతో… అక్కడి అమ్మ నివాసంలోనే పెళ్లి వేడుకలు జరుపుకుంటానని జాన్వీ కపూర్ పేర్కొంది. ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగే సంగీత్ మెహందీ వేడుకలు మైలాపూర్ లోని బంధువుల మధ్య జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని తెలిపింది. అయితే పెళ్లి మాత్రం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఖచ్చితంగా చేసుకుంటానని ఈ బ్యూటీ చెప్పింది. అయితే తన పెళ్లిని చాలా నిరాడంబరంగా చేసుకోవడమే తనకు ఇష్టమని జాన్వీ కపూర్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News