Wednesday, May 1, 2024

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

- Advertisement -
- Advertisement -

బద్రీనాథ్: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని గురువారం తెరిచారు. చార్‌ధామ్ యాత్రలోభాగమైన ఈ ఆలయాన్ని ఉదయం 7.10 గంటలకు తెరిచారు. చిరుజల్లులు, కొద్దిపాటి మంచు కురుస్తున్నప్పటికీ పెద్దసంఖ్యలో భక్తులు ఈ శుభముహూర్తాన్ని తిలకించడం కోసం అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా సుమారు 15 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. ఆర్మీ బ్యాండ్, జై బద్రీనాథ్ నినాదాల మధ్య ఆలయం తలుపులు తెరిచిన తర్వాత ప్రధాన పూజారి గర్భగుడిలో ప్రజలంతా సుఖపంతోషాలతో ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పేరిట ప్రథమ పూజ నిర్వహించారు. అంతేకాకుండా హెలికాప్టర్‌నుంచి భక్తులపై పూలవర్షం కురిపించారు. బద్రీనాథ్ ఆలయం తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్రలోని నాలుగు ఆలయాలను భక్తుల సందర్శన కోసం తెరిచినట్లయింది. హిమాలయాల్లోని ఈ నాలుగు ఆలయాలను శీతాకాలం ప్రారంభం కాగానే ఆరు నెలల పాటు మూసి ఉంచాక తిరిగి తెరవడం ఆనవాయితీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News