Tuesday, April 30, 2024

ఎస్పీ బాలు ఇకలేరు…

- Advertisement -
- Advertisement -

Balasubramanyam passed away

చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం(74) కొద్ది సేప‌టి క్రితం కన్నుమూశారు.  గత 50 రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో చెన్నైలోని ఎంజిఎం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాలుకు  శ్వాస స‌మ‌స్య‌ రావడంతో వెంటి లెటర్ పై ఉంచి ఎక్మో సపోర్ట్ ద్వారా వైద్య సేవలందించారు. తరువాత కరోనా నెగిటివ్ వచ్చినా కూడా ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.04ని.ల‌కు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రముఖులు, నటులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పద్మభూషణ్ అవార్డులతో పాటు సినీ రంగంలో పలు అవార్డులు ఆయనను వరించాయి. నెల్లూరు జల్లా కోనేటమ్మపేట గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో బాలు జన్మించారు.  బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు  శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యమని,  అభిమానులు ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. ఆయనకు భార్య సావిత్రి, పిల్లలు పల్లవి, ఎస్. పి. చరణ్ ఉన్నారు. పలు సినిమాల్లో నటించి అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News