Home తాజా వార్తలు మిస్ యు బాలు: రజినీకాంత్ (వీడియో)

మిస్ యు బాలు: రజినీకాంత్ (వీడియో)

Superstar Rajinikanth

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సినీపరిశ్రమకు తీరని లోటు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ బాలు మృతిపై విచారం వ్య‌క్తం చేశారు. ”చాలా సంవత్సరాలు నా పాటలకు గొంతును అందించారు. మీస్వరం, పాటలు, జ్ఞాపకాలు నాతో ఎల్లప్పూడు ఉంటాయి. మిస్ యూ బాలు సర్” అని ఓ వీడియోతో కూడిన ట్వీట్ చేశారు. ఆయ‌న మృతిపై సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. ఆయ‌న తుదిశ్వాస విడవడంతో సంగీత ప్రపంచం మూగ‌బోయింది.