Tuesday, May 21, 2024

బాలుని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నా: భారతీరాజా

- Advertisement -
- Advertisement -

SP Balasubrahmanyam health condition critical

చెన్నై: ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాలు ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు చరణ్ కు వైద్యులు వివరించారు. మరికాసేపట్లో ఎస్‌పి బాలు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. బాలు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఒక్కొక్కరుగా ప్రముఖులు, అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఎంజిఎం ఆస్పత్రి ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. ఎంజిఎం ఆస్పత్రికి భారతీరాజా, వైద్య శాఖ మంత్రి చేరుకున్నారు. బాలును చూడడానికి వచ్చిన భారతీరాజా ఉద్వేగానికి గురయ్యారు. బాలు విషయంలో మా ప్రార్థనలు ఫలించలేదని, బాలు కరోనాను జయించి తిరిగి వస్తారని భావించామని, కానీ పరిస్థితి అలా లేదన్నారు. తన చిరకాల మిత్రుణ్ని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నానని భారతీరాజా పేర్కొన్నారు. చెన్నైలోని బాలు ఇంటి దగ్గర, చుట్టుపక్కల పరిసరాలను మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News